RSS Movie is the Reason Behind Jr NTR and Amit Shah Dinner meeting: సినిమాలకు రాజకీయాలకు ఒక రకమైన అవినాభావ సంబంధం ఉంటూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అది మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు బీజేపీ అగ్ర నేత హోం మంత్రి అమిత్ షా తెలుగుదేశం పార్టీతో చాలా సన్నిహితంగా ఉండే జూనియర్ ఎన్టీఆర్ ను కలవబోతుండడం ఆసక్తికరంగా మారింది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సభలో పాల్గొనేందుకు అమిత్ షా ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన మునుగోడు వెళ్లబోతున్నారు. మునుగోడు సభ తర్వాత అమిత్ షా తో ఎన్టీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉందని వార్తలు బయటకు రావడంతో దీని మీద పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. ఇది రాజకీయాలకు సంబంధించిన భేటీ కాదని ఇటీవలే అమిత్ షా ట్రిపుల్ఆర్ సినిమా చూశారని ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటన మెచ్చి తనతో పాటు భోజనం చేయాలని ఆయన ఆహ్వానించారని ఇందులో రాజకీయాలకు అసలు ఏమాత్రం సంబంధం లేదని కేవలం సినిమా విషయంలో అభినందించడం కోసమే ఆయన జూనియర్ ఎన్టీఆర్ ని పిలిపించుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది.


జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం పాత్రలో నటించారు. రాజమౌళి డైరెక్షన్లో రూపొందిన ఆర్ఆర్ఆర్-రౌద్రం రణం రుధిరం సినిమాలో రామ్ చరణ్ మరో హీరోగా అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించారు. అయితే మరో ప్రచారం కూడా తెర మీదకు వచ్చింది. అదేమంటే ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాకు కదా అందించిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు భారతదేశ ప్రభుత్వం రాజ్యసభ సభ్యత్వాన్ని అందించింది.


ఈ నేపథ్యంలోనే ఆయన ఆర్ఎస్ఎస్ ఫౌండర్ జీవిత చరిత్రను బయోపిక్ గా తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఆ సినిమాకు దర్శకుడు ఎవరు? అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ కథ అందించేది మాత్రం విజయేంద్ర ప్రసాద్ అనే విషయం దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఇదే విషయాన్ని విజయేంద్ర ప్రసాద్ పలు సందర్భాల్లో మీడియా ముందు కూడా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రకు గాను ఎన్టీఆర్ ను తీసుకునే ఉద్దేశంలో సినిమా టీం ఉందని తెలుస్తోంది.


అయితే ఆర్ఎస్ఎస్ అంటే హిందువుల సంఘం అనే పేరుంది. అలాంటి సంఘానికి సంబంధించిన సినిమాలో నటిస్తే తనకు భవిష్యత్తులో ఇబ్బంది అవుతుందేమో అనే ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ దాన్ని సున్నితంగా తిరస్కరించారని అంటున్నారు. అయితే అటు ప్రధాని మోడీ ఇటు అమిషా ఇద్దరూ కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తులే. అక్కడి నుంచే వీరిద్దరూ బీజేపీ బాట పట్టారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ ను ప్రజల్లోకి మరింత తీసుకు వెళ్లే విధంగా బయోపిక్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.


ఆర్ఎస్ఎస్ అంటే ప్రస్తుతానికి కేవలం హిందుత్వవాదులు మాత్రమే జాయిన్ అవుతారు, అది హిందువులకు సంబంధించిన సంస్థ అనే ప్రచారం ఉంది. అది నిజం కాదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఈ సినిమాని వేరే లెవల్లో ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ విషయంలో అమిత్ షా కల్పించుకొని సినిమాలో నటించమని ఎన్టీఆర్ ను  కోరే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది అమిత్ షా లేదా బీజేపీ లేదంటే ఎన్టీఆర్ అయినా స్వయంగా క్లారిటీ ఇస్తే కానీ తెలియదనే చెప్పాలి. 


Also Read: RGV Tweet on Karthikeya 2: ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 కంటే 'కార్తికేయ 2' పెద్ద హిట్!


Also Read:  Roja Daughter as Heroine: ఆ హీరో సరసన హీరోయిన్ గా రోజా కుమార్తె



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి